NTV Telugu Site icon

Adilabad Students: ప్రిన్సిపల్, వార్డన్ వేధిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసన..

Adilabad Police Tetions

Adilabad Police Tetions

Adilabad Students: ప్రిన్సిపల్, వార్డన్ వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసనకు దిగిన ఘటన ఆదిలాబాద్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థులు బైఠాయించారు. ప్రిన్సిపల్, ఇతర టీచర్లు వేధిస్తున్నారంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం కోసం ఎం జే పీ విద్యార్థులు వచ్చారు. తెల్లవారు ఝామున మూడు గంటలకు ఎవరికి తెలియకుండా గోడ దూకి వచ్చామని తెలిపారు. హాస్టల్ నుంచి సుమారు 7 కిలో మీటర్ల దూరం నుంచి నడుచు కుంటూ జిల్లా కేంద్రంలో ని టూ టౌన్ పోలీసు స్టేషను కు 10 వ తరగతి విద్యార్థులు వచ్చారు. ప్రిన్సిపల్, వార్డన్ వేదిస్తున్నారని వాపోయారు. మా సమస్యల్ని చెప్పితే.. సర్టిఫికెట్ల మీద బ్యాడ్ అంటూ రిమార్క్ రాస్తానని బెదిరించారని విద్యార్థుల ఆరోపించారు.

Read also: Mallu Bhatti Vikramarka: మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్.. రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు..

అందుకే 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటాం అంటూ వాపోయారని.. పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే వారికి నచ్చ జెప్పి పోలీసు స్టేషన్ కు వచ్చామని విద్యార్థులు ఆదేవన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ను తొలగించాలని, అప్పుడే హాస్టల్ కు వెళ్తాం అని విద్యార్థలు తెలిపారు. దీంతో పోలీస్టేషన్ ముందు గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆవేదనను చూసిన పోలీసులు వెంటనే ప్రిన్సిపల్ కు కాల్ చేసి ఇక్కడి పరిస్థితిపై వివరించారు. అయితే దీనిపై ప్రిన్సిపల్ పొంతలేని సమాధానం చెప్పడంతో పోలీసులు సీరియస్ అయ్యారని సమాచారం. విద్యార్థులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రిన్సిపల్ , వార్డన్ పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారా? లేదా? అనే దానిపై ఇంకా తెలియరాలేదు.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత కొద్ది నెలలుగా తెలంగాణ పాఠశాలల్లో పిల్లలపై ప్రిన్సిపల్, వార్డెన్ లు వేధిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ లో చోటుచేసుకోవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారునేది ప్రశ్నార్థకంగా మారింది.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..