NTV Telugu Site icon

Adilabad: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు.. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతంటే..

Adilabad Patti Rate

Adilabad Patti Rate

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా మార్కెట్ యార్డ్ లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో కలెక్టర్‌ రాజర్షిషా, ఎమ్మెల్యే, ఎంపీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సుమారు 11 కాంటాలను ఏర్పాటు చేశారు. సీసీఐతో పాటు ప్రైవేట్‌ వ్యాపారులు రంగంలో ఉండనున్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు మల్టీ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.7521 ప్రకటించింది. అయితే.. తేమ శాతం 8 ఉంటే క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేసింది. 9 శాతం రూ.7,445, 10 శాతం రూ.7,370, 11 శాతం రూ.7,295, 12 శాతం ఉంటే రూ.7,220 మద్దతు ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వరంగల్ ఏనామమాముల మార్కెట్ లో రైతుల ఆందోళన చేపట్టారు. పత్తి రేటు తగ్గడంపై నిరసన తెలిపారు. కాంటాలను రైతులు నిలిపివేశారు. మార్కెట్లో రైతు సంఘం నేతలు నిరసన దిగారు. అయితే దీనిపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుజరాత్ తరహాలో రూ. 8800 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Read also: BJP Maha Dharna: నేడు ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ మహా ధర్నా.. పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..

ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ధర తక్కువగా ఉండడంతో కనీసం పెట్టుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలం వచ్చిందంటే పత్తిలో కనీసం 15 శాతం తేమ ఉంటుంది. అయితే మద్దతు ధర కంటే తక్కువ ధర ఉండడంతో సీసీఐ రంగంలోకి దిగనుంది. ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతింది. పూత, కాతు దశలో వర్షం కురిసింది. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 7 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే లభించే అవకాశం ఉంది. జిల్లాలో ఈ ఏడాది 4 లక్షల 33 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దాదాపు 32 లక్షల 47 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జిల్లాలో 20 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మొత్తం 11 లక్షల 58 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ ద్వారా 7 లక్షల 58 వేల క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 3 లక్షల 46 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతేడాది పత్తి మద్దతు ధర రూ.7,020 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు తొలిరోజు అత్యధికంగా రూ.7,100 కొనుగోలు చేశారు. ఆ తర్వాత ధర తగ్గింది. రైతుకు రూ.6,800 నుంచి రూ.6,500 వరకు ధర లభించింది.
Hyderabad Pubs: బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణ.. పోలీసులు సీరియస్..