NTV Telugu Site icon

Adilabad Agency: నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్..

Adilabad Agency

Adilabad Agency

Adilabad Agency: నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్ కు (తుడుం దెబ్బ) ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపు నిచ్చింది. వలస లంబాడీ లను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోరుతూ తుడుం దెబ్బ నాయకులు ఇవాళ ఏజెన్సీ బంద్ పిలుపు నిచ్చారు. ఉదయం నుంచే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని బస్టాండ్ ముందు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నిరసన తెలిపారు. బస్సులు బయటకు వెళ్లకుండా తుడుం దెబ్బ నాయకులు బైఠాయించారు. అనంతరం తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ.. GO MS నంబర్ 3ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. TSPA (ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాలను) ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని తెలిపారు. 40% ఆదివాసీలు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తిస్తూ, ఏజెన్సీ ప్రత్యేక DSC లో అవకాశం కల్పించాలని డిమాండ్ లో పేర్కొన్నారు. 29 శాఖలో ఉన్న GO లను చట్టంగా చేయాలని తెలిపారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేసి గిరి వికాసం ద్వారా బోరు బావులు మంజూరు చేయాలన్నారు. ITDA ద్వారా ప్రత్యేక DSC నిర్వహించాలి. మరియు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ITDA లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతా రక్షణకై భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ.. ఏజెన్సీ ప్రాంత బందుకు పిలుపునివ్వడం జరిగిందని (తుడుం దెబ్బ) ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని బస్టాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
iphone 16 Launch: ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్ డేట్ వచ్చేసింది.. యాపిల్‌ ప్రియులకు పండగే ఇగ!

Show comments