NTV Telugu Site icon

Addanki Dayakar: వీడిన కోమటిరెడ్డి మిస్టరీ.. త్వరలో అభ్యర్థి ప్రకటన

Addanki Dayakar On Venkat R

Addanki Dayakar On Venkat R

Addanki Dayakar Gives Clarity On Komatireddy Venkatreddy Role In Munugodu Campaign: మునుగోడు ప్రచారంతో తనకు సంబంధం లేదని, కాంగ్రెస్ తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనను అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జరిగిన కోర్ కమిటీ సమావేశం తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక ఆయన ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసి, పార్టీని నమ్ముకున్న తనలాంటి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో.. ఈయన రాజగోపాల్ రెడ్డి తరహాలోనే కాంగ్రెస్‌ను వీడనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఆ మిస్టరీపై తాజాగా అద్దంకి దయాకర్ క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పకుండా పాల్గొంటారని అన్నారు. ఇప్పటికే తాను, రేవంత్ రెడ్డి ఆయనకు క్షమాపణలు చెప్పామని.. ప్రియాంకా గాంధీతోనూ ఆయన మాట్లాడారని అన్నారు. మునుగోడు అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. టిఆర్ఎస్, బిజెపి పార్టీలు కలిసి.. మునుగోడు ఎన్నికలను రాజకీయ క్రీడగా మార్చాయన్నారు. అటు.. ఓవైపు ఒవైసీ, మరోవైపు రాజాసింగ్ కలిసి రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత లాభం కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడని, మునుగోడు ప్రజలను మోసం చేసిన అతనికి కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానం చెప్తారని హెచ్చరించారు.