NTV Telugu Site icon

మా ఎన్నికలు.. లోపల బీభత్సం.. కురుక్షేత్రం జరుగుతోంది..!

‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి… రిగ్గింగ్ లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి.. పోలింగ్‌ బూత్‌లో మోహన్‌బాబు ఆవేశంతో ఊగిపోయి… బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగతే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు.. మరోవైపు.. శివబాలాజీ, సమీర్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది… దీంతో.. కాసేపు పోలింగ్‌ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.. ఇక, సమీర్‌పై ఎన్నికల అధికారికి శివబాలాజీ ఫిర్యాదు చేశారు.. ఇక, పోలింగ్‌ బూత్‌ పరిసరాల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదు వచ్చిందని ఎన్నికల అధికారి తెలిపారు.. మరోవైపు.. ఈ పరిణామాలపై స్పందించిన యాక్టర్ సుమన్.. లోపల కురుక్షేత్రమే నడుస్తుందన్నారు.

అసలు ప్రెసిడెంట్ పోస్టు మహిళలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు సుమన్.. మహిళల్లో కూడా సీనియర్లు ఉన్నారని.. తర్వాత ఎన్నికలకైనా.. మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరారు.. ఇక, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు సమస్యలు ఉన్నాయన్నారు సుమన్. మా ఎన్నికల్లో లోకల్‌, నాన్‌లోకల్‌ అనే ఫీలింగ్‌కు అవకాశం లేదు. లోకల్‌, నాన్‌లోకల్‌ అనేది లేవనెత్తితే.. మనకు కూడా సమస్య వస్తుంది. రాష్ట్రం విడిపోయింది కాబట్టి.. తెలంగాణ వాళ్లకు మాత్రం ప్రియార్టి ఇవ్వాలన్నారు. ఇక, పోలింగ్‌ కేంద్రంలో పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు స్పందించిన సుమన్‌.. లోపల బీభత్సం జరుగుతోంది… కురుక్షేత్రమే జరుగుతోందన్నారు. అంతా యంగ్‌ స్టార్ట్స్ ఉన్నారు.. వేడి రక్తం కాబట్టి.. అది కామన్‌ అని.. గతంలోనూ ఇలాంటివి నేను చూసినవే అన్నారు సుమన్..