NTV Telugu Site icon

నిజాలు తేలితే ఎన్నికల తర్వాత కూడా చర్యలు తప్పవు : శశాంక్‌ గోయల్‌

హుజురాబాద్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు 306 పోలింగ్‌ స్టేషన్‌లను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధనలు ఎవ్వరూ ఉల్లఘించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతామని.. నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు.