Site icon NTV Telugu

లాక‌ప్‌ డెత్ కేసులో మరో అధికారి పై చర్యలు…

అడ్డ‌గూడురు పోలీస్‌స్టేష‌న్ లాక‌ప్‌ డెత్ కేసులో మరో అధికారి పై చర్యలు తీసుకున్నారు సీపీ. చౌటుప్ప‌ల్ ఏసీపీ స‌త్త‌య్య‌ను రాచ‌కొండ పోలీస్‌ క‌మీష‌న‌రేట్‌కు ఆటాచ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసారు సీపీ. భువ‌న‌గిరి ట్రాఫిక్ ఏసీపీ శంక‌ర్‌కు అద‌న‌పు భాద్య‌త‌లు అప్ప‌గించారు క‌మీష‌న‌ర్‌ మహేష్ భగవత్. ఇప్పటికే ఎస్సై మహేష్ ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసిన సీపీ… ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అయితే ఈ లాక‌ప్‌ డెత్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version