Site icon NTV Telugu

Mother and Son Suicide Case : కామారెడ్డి ఘటనలో.. నిందితులకు బెయిల్‌..

high court

high court

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి తల్లి కొడుకుల ఆత్మహత్య కేసులో నిందుతులకు బెయిల్‌ మంజురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొంద‌రు వ్య‌క్తుల‌ వేధింపుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నామంటూ మెదక్ జిల్లా రామాయంపేట‌కు చెందిన సంతోష్‌, అత‌డి త‌ల్లి ప‌ద్మ కామారెడ్డిలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. 18 నెల‌లుగా 7గురు వ్య‌క్తులు త‌మ‌ను తీవ్ర వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని చెప్పిన సంతోష్‌..వారి పేర్ల‌ను కూడా వెల్ల‌డించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మ‌కంగా తీసుకున్న పోలీసులు బాధితుడు వెల్ల‌డించిన పేర్ల ఆధారంగా మొత్తం 7గురిపై కామారెడ్డి పోలీసులు కేసులు న‌మోదు చేశారు. పోలీసులు విచార‌ణ చేస్తుండ‌గానే.. నిందితుల్లో ఆరుగురు లొంగిపోగా…మ‌రో నిందితుడు ప‌రారీలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో బెయిల్ కోసం ఆరుగురు కామారెడ్డి కోర్టును ఆశ్ర‌యించ‌గా.. ప్రతి శుక్ర‌వారం కామారెడ్డి పోలీస్ స్టేష‌న్‌లో సంత‌కం చేయాల‌న్న నిబంధ‌న‌తో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

Exit mobile version