Site icon NTV Telugu

Atrocity: ESI ఆసుప్రతి లిఫ్ట్‌లో యువతిపై అత్యాచారం కేసు.. నిందితున్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Esi Rape Case

Esi Rape Case

Atrocity: ఈఎస్ఐలో రోగి సోదరిపై అత్యాచారం చేసిన నిందితుడు షాదాబ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రోగి సోదరిపై షాబాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్టులో బలవంతంగా పైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షాబాద్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మూడు రోజుల నుంచి పరారీలో వున్న షాదాబ్ ను ఎట్టకేలకు ఎస్ ఆర్ నగర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Read also: Disney India: అంబానీ చేతికి డిస్నీ ఇండియా..? అదే జరిగితే..!

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ESI ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. వారం రోజుల నుండి యువతి అన్నయ్య సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించింది. బాధితుడికి ఇటీవల నొప్పి ఎక్కువకావడంతో.. ఈ నెల 6న సోద రుడిని తీసుకొని ఆసుపత్రికి వచ్చింది. రాత్రి సోదరుడికి ఆహారం తీసుకురావడానికి ఆరో అంతస్తు నుంచి యువతి కిందికి వచ్చింది. తిరిగి వెళ్లబోతుంటే ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు ఆమెకు అక్కడి క్యాంటీన్లో పనిచేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. ఏదైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని సూచించాడు. ఆమె తిరిగి లిఫ్టులో వెళ్తుంటే షాదాబ్ అనుసరించి బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రక్త పరీక్షలు చేసే గదిలో మరోసారి అత్యాచారం చేశాడు. యువతి సోదరుడికి ఫోన్ చేయగా.. అతను రెండో అంతస్తుకు చేరుకొని గట్టిగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు షాదాబ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Food Poison: కలుషిత ప్రసాదం తిని.. 79 మందికి అస్వస్థత!

Exit mobile version