Accident at Tummalur Gate: ఇటీవలి కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు వాహనదారులకు భద్రతాపరమైన సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు, ఇంకా పెరిగిపోతున్నాయి. సాధారణంగా కార్లు, బస్సులు, ఇతర భారీ వాహనాలు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తపనతో వేగంగా వెళ్తుంటాయి. దీంతో క్షణాల్లో ప్రమాదం జరిగిపోతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో అర్థాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఇక తుమ్మలూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారు డిసిఎం ఢీకొనగా షిఫ్టులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందిన గటన తీవ్ర కలకలం రేపింది.
Read also:Revanth Reddy: గోడదూకిన రేవంత్ రెడ్డి.. అందరూ షాక్..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారు డిసిఎం ఢీకొనగా షిఫ్టులు ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. వెల్దండ నుండి హైదరాబాద్ వెళుతున్న షిఫ్ట్ కారు మాక్ ప్రాజెక్ట్ సమీపంలోకి రాగానే డీసీఎం డ్రైవర్ కలకొండపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాను షిఫ్ట్ కారుకు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో.. ఈప్రమాదం జరిగింది. వేగంగా డీసీఎం వ్యాను షిఫ్ట కారును కొట్టడంతో షిఫ్ట్ కారులో ప్రయాణించే నలుగురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న మహేశ్వరం పోలీసులు. చనిపోయిన వ్యక్తులు రామస్వామి యాదయ్య, కేశవులు, శ్రీను గా గుర్తించారు. వీళ్లంతా పోతేపల్లి గ్రామం వెల్దండ మండలం నాగర్ కర్నూల్ జిల్లా చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. మృతదేమాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Turkey Earthquake: టర్కీ భూకంపంలో 21 వేలకు చేరిన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు