NTV Telugu Site icon

AEE Nikesh Kumar: రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. ఏసీబీ కస్టడీకి ఏఈఈ నిఖేష్

Aee Nikesh Kumar

Aee Nikesh Kumar

AEE Nikesh Kumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయిన ఇరిగేషన్‌ ఏఈఈ నిఖేష్‌ కుమార్‌ ను కోర్టు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. దీంతో చంచల్ గూడ జైల్ నుండి ఏఈఈ నిఖేష్ ను నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ తీసుకున్నారు. హైదరాబాద్‌ లో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్ లో పని చేస్తున్న నిఖేష్‌ ఆదాయానికి మించి రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీకి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్‌ 1న నిఖేష్‌ ఇంటితో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు.

Read also: Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్‌ ‘జీబ్రా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

దాదాపు రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడని గుర్తించి అరెస్ట్‌ చేశారు. అనంతరం నిఖేష్‌కు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం నిఖేష్‌కు 14 రోజుల పాటు జ్యేడీషిల్‌ రిమాండ్‌ విధించింది. బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఏకీభవించిన కోర్టు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ నిఖేష్‌ ను ఏసీబీ కస్టడీకి తీసుకునింది.

Read also: MLC Kavitha: బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది..

బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయనుంది. నిన్న నిఖేష్ కు సంబంధించి మరో బినామీ లాకర్ ను ఓపెన్ ఏసీబీ అధికారులు చేశారు. అందులో మరో 1.5Kg ల బంగారు ఆభరణాలతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరొక 16 లాకర్స్ ని ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. నిఖేష్‌కు సంబంధించిన లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బంగారం బయటపడే అవకాశం ఉందని ఏసీబీ తెలిపారు. నిఖేష్ కు సహకరించిన వారిపై అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. నిఖేష్ ఎవరికైనా బినామీగా ఉన్నాడని తేల్చే పనిలో ఉన్న ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana Secretariat: నేటి నుంచి సెక్రటేరియట్‌లో అటెండెన్స్.. లేటుగా వస్తే లాసేనా..

Show comments