NTV Telugu Site icon

ACB Rides: హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు..

Dtc

Dtc

హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు వ‌రంగ‌ల్‌, ఆయ‌న స్వస్థలం జ‌గిత్యాల‌తోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏక‌కాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల స‌మ‌యంలో ప‌లు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు గుర్తించిన అధికారులు. రూ.2.79 కోట్ల విలువైన మూడు ఇళ్లు, 13 .57 ల‌క్షల విలువైన‌16 ఓపెన్ ప్లాట్లు, రూ.14 ల‌క్షల విలువైన 15.20 ఎక‌రాల వ్యవసాయ భూమి గుర్తించారు.

Also Read: Bhishma Ekadashi: నేడు భీష్మ ఏకాదశి.. మీ కష్టాలు తీరాలంటే ఇలా చేయండి!

5 ల‌క్షల బ్యాంకు బ్యాలెన్స్‌, రూ.22.85 ల‌క్షల కార్లు, ద్విచ‌క్ర వాహ‌నాలు, కిలోన్నర బంగారం, 400 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న అధికారులు. సోదాల్లో 23 విదేశీ లిక్కర్ బాటిళ్లు సహా మొత్తం రూ.4.04 కోట్ల విలువైన ఆస్తులు స్వాదీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం.. ఆస్తుల విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కేసు న‌మోదు చేసి డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.