Shiva Balakrishna: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు విచారించగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శివబాలకృష్ణ బినామీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో శివబాలకృష్ణ బినామీ అయిన భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్‌లకు ఏసీబీ నోటీసులు పంపింది. వీరిని నేడు ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నారు. భరణి హెచ్‌ఎండీఏలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పెట్టించాడు. శివ బాలకృష్ణ కు పిఏ గా భరణి వ్యవహరించాడు. ఎన్విస్ డిజైన్ స్టుడియో పేరుతో భరత్ కన్సల్టెన్సీ నిర్వహించారు. ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లే అవుట్ బిల్డింగ్ లకు అన్ని అనుమతులు బాలకృష్ణ జారీ చేసాడు. మరో.. బినామీ ప్రమోద్ కుమార్ కు మీనాక్షి కన్స్ట్రక్షన్ లో ఉద్యోగం ఇప్పించాడు. మీనాక్షిలో అన్ని పనులు చేయించాడు. మేనల్లులనే తన సైన్యంగా మలచుకుని కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. శివ బాలకృష్ణ ఆర్థిక లావాదేవీలు సొదరుడు నవీన్ కుమార్ మొత్తం చూసుకునేవాడు. మేనల్లులు భరత్, భరణితో పాటు స్నేహితుడు సత్యనారాయణను ఏసీబీ విచారించనుంది.
Read also: MP Adala Prabhakar Reddy: నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ
కాగా.. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు విచారణకు హాజరు కావాలని ముగ్గురికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే, శివ బాలకృష్ణ ఆస్తుల లావాదేవీలు నిలిపివేయాలని కలెక్టర్ కి ఏసీబీ లేఖ రాసింది. ఇక, శివ బాలకృష్ణ కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాలు ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ కస్టడీలో ఉన్న శివ బాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని సదరు ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ రెడీ అవుతుంది. అయితే, శివ బాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ 2021 నుంచి 2023 లోనే కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో శివ బాలకృష్ణకు 57 ఎకరాల భూమి ఎలా వచ్చింది అనే దానిపై ఏసీబీ అధికారులు విచాణ చేస్తున్నారు.
MP Adala Prabhakar Reddy: నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ