Site icon NTV Telugu

Jalmandali GM: జలమండలి జీఎంకు మూడేళ్ల జైలు..! ACB కోర్టు సంచలన తీర్పు

Jalmandali Gm

Jalmandali Gm

Jalmandali GM: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వాటర్ బోర్డు అధికారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు.

Read also: Pooja Hegde : పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణంతో..

హైదరాబాద్ తార్నాక మాణికేశ్వరనగర్‌కు చెందిన బొంత మైసయ్య వాటర్‌ బోర్డు కాంట్రాక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. జలమండలికి చెందిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్-14లో లీకేజీ మరమ్మతులను ఆయన నిర్వహిస్తున్నారు. అయితే.. 2010లో అప్పటి జలమండలి డివిజన్-14 జీఎంగా ఉన్న రత్లావత్ లోకిలాల్.. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గుత్తేదారు మైసయ్యకి లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు తన వద్ద లేదని తెలిపినా రత్లావత్ ససేమిరా అన్నాడు. లేదంటే నీ ఇష్టం అంటూ బ్లాక్ మైయిల్ చేశాడు. దీంతో మైసయ్య కాస్తైన డబ్బులు తగ్గించాలని కోరాడు.

అయినా రత్లావత్ అస్సలు తగ్గేది లేదని అన్నడంతో చివరకు డబ్బులు ఇచ్చేందుకు మైసయ్య ఒకే అన్నాడు. రత్లావత్ చేష్టలకు విసిపోయిన మైసయ్య చివకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించిన ఏసీబీ అధికారులు జీఎంకు రూ.50 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ నివేదికను కోర్టులో సమర్పించారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ జీఎం లోకీలాల్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Kamal Haasan: అన్ని సినిమాలని ఎలా సెట్ చేస్తున్నారు? ఎప్పుడు చేస్తారు?

Exit mobile version