NTV Telugu Site icon

Love Failure: నా లవర్ వదిలేశాడు.. పంజాగుట్ట శ్మశానంలో యువతి న్యూసెన్స్

Love Failure

Love Failure

Love Failure: ఆదివారం పంజాగుట్టలో ఓ యువతి హల్ చల్ చేసింది. పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద అర్ధరాత్రి ఓ యువతి వీరంగం సృష్టించింది. రెండు గంటలపాటు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు గొడవ జరిగింది. ప్రేమికుడు తనను విడిచిపెట్టాడని శ్మశానంలో కన్నీరుపెట్టుకోవడం ప్రారంభించింది. అంతేకాదు కాసేపటికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. యువతి హంగామా చేస్తుండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని శ్మశాన వాటిక నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యువతికి బహిరంగంగా బీభత్సం సృష్టించడంపై పోలీసులు కౌన్సెలింగ్ చేస్తున్నారు.

Read also: TS Eamcet: ఎంసెట్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించనున్నారు. యువతి అర్థరాత్రి వీరంగం సృష్టించడంతో ఏమైందని స్థానికులు ఆమెను ప్రశ్నించారు. ప్రేమించిన అబ్బాయి తనను వదిలేశాడని, అతని లేని జీవితం నేను ఊహించుకోలేనని చెప్పుకొంచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని చెప్పింది. ఆయువతిని ఆత్మహత్య చేసుకోవద్దని యువతికి నచ్చజెప్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి యువతి గొడవచేస్తుండటంతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు అలాగే చూస్తు ఉండిపోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Police: సారా కావాలన్న ఖైదీ.. సంస్కారంగా ఇప్పించిన పోలీస్

Show comments