NTV Telugu Site icon

ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికైన తెలంగాణ కుర్రోడు.. ఆ రికార్డు ఇతనిదే..

ఎన్ని రికార్డులకు కొలువైన తెలంగాణలో పుట్టిన ఓ కుర్రోడు తనకంటూ మరో రికార్డు క్రియేట్‌ చేశాడు. తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్‌) లో విద్యానభ్యసిస్తున్న పి. అశోక్‌ (17) అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. యూపీఎస్సీ నిర్వహించిన ప్రవేశ పరీక్షతో పాటు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూలో తన ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణుడిగా నిలిచాడు. దీంతో నేషన్‌ డిఫెన్స్‌ అకాడమీక (ఎన్‌డీఏ)కు ఎంపికయ్యాడు.

అంతేకాకుండా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికైనా తొలి క్యాడెట్‌గా అశోక్‌ రికార్డ్ నమోదు చేశారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అశోక్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికవడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.