NTV Telugu Site icon

Tiger attack on Goat: కామారెడ్డి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి.. గొర్రెల మందపై దాడి

Tiger Attack On Goat

Tiger Attack On Goat

Tiger attack on Goat: ఏజెన్సీ ప్రాంతాలకు తోడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు. పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. కామారెడ్డి ఆదిలాబాద్ , కొమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన అంగోత్ బన్సీ గొర్రెలను మేతకు మేపుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గొర్రెల మంద పై చిరుత పులి దాడి చేయడంతో జనం బెబ్బేలెత్తుతున్నారు. గమనించిన స్థానిక గొర్రెల కాపరులు ఆరవడంతో పులి అక్కడి నుంచి పారారయ్యింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజులుగా ఏజన్సీ ప్రాంతాల్లో పులి సంచారం జరుగుతుందని తెలిపిన చర్యలుచేపట్టలేదని మండిపడుతున్నారు. పులుల బోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read also: Droupadi Murmu: ఏపీలో 2 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే

ఇదే ప్రాంతంలో గత రెండు రోజుల క్రితం చిరుత పులి రెండు చిరుత పిల్లలతో సంచరిస్తున్నట్లు పేర్కొన్న గ్రామస్తులు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామ సమీపంలోని రిజర్వాయర్ వద్ద బుధవారం తన మూడు పిల్లలతో ఒక పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక ట్రక్ డ్రైవర్ పులిని వీడియో తీసి షేర్‌ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. పెంగంగా నది మీదుగా నిర్మాణంలో ఉన్న చనకా-కొరాట నీటిపారుదల ప్రాజెక్టు పంప్ హౌస్ సమీపంలో, వ్యవసాయ పొలాల్లో, మండలంలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శివారు ప్రాంతాల్లో తాము కూడా పులి కనిపించిందని స్థానికులు తెలిపారు.

Read also: Salaar: ఈ యాక్షన్ ఎపిక్ అనౌన్స్ అయ్యి రెండేళ్లు…

ఇక మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తడోబా అభయారణ్యంలో రెండు పులుల మృతి చెందాయి. వేరే వేరే ప్రాంతాల్లో రెండు పులుల కళేబరాలు లభ్యమయ్యాయి. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చనిపోయిన పులులు టీ 75, టీ 60 గుర్తించారు. ఎవరు చంపేశారన్నది విచారణ చేపట్టారు. పులులు సంచరిస్తున్నాయని చంపేశారా? లేక వాటి చర్మం కోసం చంపేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
JNU: జేఎన్‌యూలో మరో వివాదం.. క్యాంపాస్‌లో బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు