NTV Telugu Site icon

Adilabad: చింతగూడలో ఎద్దుపై పెద్దపులి దాడి.. జాగ్రత్తలపై అటవీ శాఖ అవగాహన..

Adilabad Tiger

Adilabad Tiger

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచరిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న (బుధవారం) చింతగూడలో రైతు చూస్తుండగానే ఎద్దు పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అజ్జర్ వజ్జర్, చింతల్ బోరి , నిగిని చింతగూడ శివారులలో రెండు రోజులుగా పులి సంచరిస్తుందనే ప్రాంతాల్లో ఫారెస్ట్ సిబ్బంది కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. పులి ఎద్దుపై దాడి చేయండలో అలర్ట్ అయిన అధికారులు దీంతో గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి పులి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.

Read also: KTR Tour: నేడు ఆదిలాబాద్‌ లో కేటీఆర్‌ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..

పులిని బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చింతగూడ ప్రాంతంలో ఓ మహిళ గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారం అందించింది. గ్రామస్థులు వెళ్లి చూడగా పులి అక్కడ కనిపించలేదు. పులి పత్తి చేల నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. కొంత సేపటికి కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టిన ఎడ్లు పులిని చూసి తాళ్లు తెంపుకుని గ్రామానికి చేరాయి. చింతగూడ గ్రామస్తులకు కొండ సమీపంలోని పత్తి వరిలో పులి పాదముద్రలు కనిపించాయి. బుధవారం దాన్ని పట్టుకునేందుకు దాదాపు 20 మంది బేస్ క్యాంపు సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మరోవైపు నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్ ఎకో పార్క్ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎకో పార్క్‌లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుధవారం ఎకో పార్క్ కమాన్ వద్ద ఉన్న బొమ్మ చిరుత వద్దకు నిజమైన చిరుత వచ్చి కాసేపు నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Road Accident: రిసెప్షన్‌కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి