NTV Telugu Site icon

ATM Robbery: ఈ టెక్నీషియన్ మాయలోడే.. ఎంత సింపుల్ గా ఏటీఎం దోచేసాడో సారు

Atm Roberry

Atm Roberry

ATM Robbery: ఇటీవల పలు ప్రాంతాల్లో ఏటీఎంలో చోరీ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వారంతా పకడ్బందీగా గునపాలు, కట్టర్లతో ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం చోరీకి వచ్చిన ఓ దొంగ తన చేతిలో ఫోన్ ఆన్ చేసి సింపుల్ గా ఏటీఎం చోరీకి పాల్పడ్డాడు. అందులోని డబ్బులను మొత్తం దోచుకుని జెంటిల్ మెన్ గా బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే సిసి కెమెరా ఉందని మర్చిపోయాడు పాపం. అందులో అతను చేసిన ఫోన్ సంభాష, ఫోన్ ఆన్ చేసుకుని దాని చూస్తూ ఏటీఎం లో మణి కొట్టేసే సీన్ ప్రతీదీ రికార్డు కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏటీఎం దొంగ ఎవరో కాదు టెక్నీషియన్ అనే నిర్ధారించారు పోలీసులు. అయితే ఈ ఘటన నగరంలోని కెపీహెచ్ పీ కాలనీలో చోటుచేసుకుంది.

Read also: Vyjayanthi Movies: ఎన్టీఆర్ నుంచి నాని వరకూ అందరినీ వాడేస్తున్నారు…

హైదరాబాద్‌ లోని కేపీహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర బ్యాంక్ ఏటీఎంలో చోరీ కలకలం రేపింది. కేపీహెచ్‌బి పరిధిలోని ఏటీఎంలో సుమారు నాలుగు లక్షల రూపాయలు దొంగతనం చేసినట్లు సమాచారం. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నంబర్ 4 లో మహారాష్ట్ర బ్యాంక్ ఏటిఎం తాళం షట్టర్ ఓపెన్ చేసి ఉండడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఏటీఎం చోరీకి పాల్పడింది టెక్నీషియన్ దొంగ తనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సి.సి.పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ టెక్నీషియన్ ధైర్యంగా తాళాలు ఏటీఎంలో ఓపెన్ చేసి డబ్బులు దొంగిలించడం ఏమిటని సిబ్బంది పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నీషియన్ పనిచేస్తున్న వ్యక్తి ఫోన్ ఆన్ చేసుకుని ఎవరితోనే సంభాషించడం పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. ఆ ఫోన్ లో మెసేజ్ లు చేస్తు ఏటీఎం చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే దొంగతనానికి పాల్పడిన టెక్నీషియన్ ఎవరితో మాట్లాడాడు? ఎవరికి ఫోన్ చేశాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఏటీఎం చోరీకి పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
TS Government: జేపీఎస్ లకు లాస్ట్ ఛాన్స్.. మధ్యాహ్నం 12 వరకు రాకపోతే లిస్ట్ లో లేనట్టే

Show comments