పలు కమర్షియల్‌ చిత్రాలతో పాటు కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో నాయికగా గుర్తింపు తెచ్చుకుంది కృతి. 

హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే నిత్యం నేర్చుకుంటూనే ఈ ప్రయాణంలో ఎదిగానని చెబుతున్నదామె.

తాజాగా కృతి సనన్‌ మాట్లాడుతూ…‘ఇంట్లో నేనే పెద్దదాన్ని. చేసే ప్రతి పని సరిగ్గా చేయాలని, అప్పుడే నా తర్వాత వాళ్లకు ఆదర్శంగా ఉంటానని అనుకునేదాన్ని. 

మోడలింగ్‌ చేసేప్పుడు తొలి ఫొటోషూట్‌కు భయపడ్డాను. సరిగ్గా ఫొటోషూట్‌ చేయలేదని ఏడ్చాను. 

నా తప్పుల నుంచే ప్రతి విషయం నేర్చుకుని ముందుకు అడుగేస్తుంటాను. మన అపజయాలే మనకు అన్నీ నేర్పిస్తుంటాయి’ అని చెప్పింది.

ప్రస్తుతం ప్రభాస్‌ సరసన కృతి సనన్‌ నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధమవుతున్నది. 

దీంతో పాటు ‘ది క్రూ’ అనే మరో చిత్రంలో నటిస్తుంది కృతి. 

ఈ చిత్రంలో కరీనా కపూర్‌, టబూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.