NTV Telugu Site icon

Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి

Woman Died Violently

Woman Died Violently

Woman Died Violently: ఈమధ్యకాలంలో తరుచూ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో తనువు చాలిస్తున్నారు. దీంతో కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆయువతి బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులు పోలీసులకు సమాచారం అంచడంతో హుటా హుటిన చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అంజలి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Manikrao Thakre: రెండోరోజు థాక్రే పర్యటన.. నేడు గాంధీభవన్‌లో రేవంత్ పాదయాత్రపై చర్చ

అయితే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అంజలి హర్యానాకు చెందినది గా గుర్తించారు పోలీసులు. అంజలి ఇఫ్లూ యూనివర్సిటీలో ఏంఏ ఇంగ్లీష్ కోర్స్ చేస్తుందని తోటి విద్యార్థినులు తెలిపారన్నారు. నిన్న అర్థరాత్రి సమయంలో అంజలి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసింది. తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూనే హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే..కుటుంబ సమ్యసలతో అంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు ఓయూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంజలి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడుతున్నారు. కుటుంబ సమస్యలేనా? లేక మరే ఇతర కారణాలతో అంజలి ఆత్మహత్యకు పాల్పడిందా అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని అంజలి మృతితో ఓయూలో తీవ్ర విషాదం నెలకొంది.
Old City Hyderabad: గొడవలకు అడ్డాగా పాతబస్తీ.. పార్కింగ్‌ విషయంలో తల్వార్లతో దాడులు