NTV Telugu Site icon

Dog attacks: తెలంగాణలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. బలవుతున్న చిన్నారులు

Dogs

Dogs

Dog attacks: తెలంగాణలో వీధికుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నారు. వీధికుక్కల దాడి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే పిల్లలు వీధికుక్కల దాడులకు గురవుతున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలపై వీధికుక్కలు దాడి చేయడంతో పలువురు మృతి చెందిన విషాద ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ చిన్నారిపై వీధికుక్కలు మరోసారి కుక్కల దాడి సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పట్టణంలో ఆరేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. మార్కెట్‌లో మహిరా అనే ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. మహిరా ఆడుకుటుండగా అక్కడే వీధి కుక్కలు చిన్నారిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. చిన్నారి కేకలు వేయడంతో అక్కడే వున్న స్థానికులు మహిరాను కుక్కల బారి నుంచి రక్షించారు. ఈ దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిన్నారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.

Read also: New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోనే మరో ఘటన చోటుచేసుకుంది. పాశమైలారం సోమశిల కాలనీలో ముగ్గురిపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు ఇస్నాపూర్ లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుక్కలు సైరవిరారం చేస్తున్న సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నగరంలోని మణికొండలోని పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ తలుపు తట్టాడు. తలుపు తెరవగానే పెంపుడు కుక్క యజమాని కంటే ముందే బయటకు వచ్చి డెలివరీ బాయ్‌పై విరుచుకుపడింది. కుక్క ఒక్కసారిగా అరవడంతో భయపడిన డెలివరీ బాయ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే.. అప్పటికే కుక్క ముందుకు దూసుకురావడంతో.. ప్రాణాలను కాపాడుకోవాలనే తొందరలో తాను మూడో అంతస్తులో ఉన్నానని మరిచిపోయి.. అక్కడి నుంచి కిందకు దూకాడు.

ఈ ఘటనలో డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన డెలివరీ బాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజాగా హనుమకొండ జిల్లాలో వీధికుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం అందరినీ కలిచివేసింది. పార్కులో ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్‌లోని కాంచనబాగ్‌లోని డీఆర్‌డీఓ టౌన్‌షిప్‌లో గత కొద్దిరోజులుగా మూడేళ్ల బాలుడిపై ఐదు కుక్కలు దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా రాష్ట్రంలో చిన్నారులపై వీధికుక్కల వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.
GSLV F-12 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ షురూ..