NTV Telugu Site icon

ATM Fraud: కామారెడ్డిలో కేటుగాడు.. ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు కాజేసిన దుండగుడు..

Kamareddy Atm Froud

Kamareddy Atm Froud

ATM Fraud: డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన రాజు అనే వ్యక్తి వద్ద నుంచి ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు కాజేశాడు గుర్తుతెలియని దుండగుడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

Read also: Jagtial Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం.. వృద్ధ దంపతుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం..

రాజు అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. సిరిసిల్ల రోడ్డ పక్కనే వున్న ఏటీఎంలో రాజు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. రాజు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే ప్రయత్నంలో డబ్బులు రాలేదు. అప్పటి నుంచి అక్కడే వున్న మరోవ్యక్తి రాజును గమనిస్తున్నాడు. డబ్బులు ఏటీఎం నుంచి బయటకు రాకపోవడంతో డబ్బులు డ్రా చేసి ఇస్తా అని రాజుకు తెలిపాడు. దీంతో రాజు ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తికి ఇచ్చాడు. డ్రా చేసే ప్రయత్నం చేసి డబ్బులు రావడం లేదని చెప్పి రాజుకు వేరే ఏటీఎం కార్డు ఇచ్చాడు.

Read also: Rishabh Pant: ‘స్టుపిడ్’ అంటూ రిషబ్ పంత్‌పై విరుచకపడ్డ గవాస్కర్

దీంతో రాజు ఆ కార్డును పరిశీలించకుండా తనదేనని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దుండగుడు ఏటీఎం నుంచి రూ.40 వేల రూపాయలు డబ్బులు డ్రా చేశాడు. వెంటనే రాజుకు డబ్బులు డ్రా జరిగినట్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన రాజు షాక్ తిన్నాడు. తన ఏటీఎం కార్డు మారిందని రాజుకు అనుమానం వచ్చి వెంటనే అకౌంట్ బ్లాక్ చేయించాడు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వకూడదని, ప్రజలు ఇలాంటి వారిపట్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Fan Warning : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా..