Adilabad Crime: ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించిన గొప్పది ఏది లేదు. తల్లి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరో జీవికి ప్రాణం పొస్తుంది. ఆ పుట్టిన బిడ్డను పెంచుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా భయపడదు. తన శక్తినంతా ధారపోసి మరీ తన బిడ్డను పెంచుకుంటుంది. అందుకనే అమ్మని మించి దైవం లేదని అంటారు. మాతృదేవో భవ అంటూ మన దేశంలో అమ్మకు మొదటి స్థానం ఇచ్చారు. అంతటి గొప్పదనం అమ్మ ప్రేమ సొంతం. ఇప్పటి కాలంలో వచ్చిన మార్పులో.. లేక పరిస్థితుల ప్రభావమో.. అమ్మ ప్రేమలో కూడా మార్పులు వచ్చాయి. మాతృత్వం సిగ్గుపడేలా కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మాతృ ప్రేమ మలినం అవుతోందనిపిస్తోంది. నవ మాసాలు మోసిన కన్నపేగును సైతం తల్లి వదిలించుకునే దుస్థితి వచ్చింది. తాజాగా అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడేసిన అమానవనీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే ఆపసికందు అదృష్టమో, అదృష్టమో కానీ..క్షేమంగానే ఉన్నాడు. ఈ అమానుష ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Read also: Pooja Hegde: బుట్ట బొమ్మ అందాలకి కుర్రకారు ఫిదా….
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగశిశువును పొదల్లో పడేసి వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున అటుగా వెళ్లిన కొందరు గ్రామస్థులు శిశువు ఏడుపు శబ్దాన్ని విన్నారు. వెంటనే పొదల్లోకి వెళ్లి చూడగా.. శిశువు ఏడుస్తూ కనిపించింది. ఆ శివువుకు మట్టి అంటుకుని, ముల్లు గుచ్చుకోవడంతో ఏడుస్తూ వుండటం చూసి అక్కడున్న వారందరికి మనసు చలించింది. వెంటనే ఆ మగ శిశువును తీసుకుని వచ్చి స్నానం చేయించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును సరైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
TDP 2nd List: టీడీపీ రెండో జాబితా ఇదే