NTV Telugu Site icon

Vande Bharat Train: వందే భారత్‌ రైలుకు తప్పిన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..

Vande Bharat Train

Vande Bharat Train

Vande Bharat Train: వందే భారత్ రైలు ప్రమాదం తప్పింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తీక్యాతండా సమీపంలోని రైలు పట్టాల వద్ద చోటుచేసుకుంది. మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో స్టాప్‌ లేకపోవడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ రైలు అదే వేగంతో నడుస్తోంది. మిర్యాలగూడ మండలం తీక్యాతండా సమీపంలో ఉదయం 9 గంటల సమయంలో రైలు పట్టాలపై గేదె వచ్చింది. అయితే వేగంగా వచ్చిన వందేభారత్‌ రైలు ఢీకొనడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన డ్రైవర్ వెంటనే రైలును ఆపి తనిఖీ చేశారు. ఈ ఘటనలో రైలు డ్యామేజ్ కాలేదని తెలుసుకున్న తర్వాత తిరిగి బయలుదేరింది. ఘటనా స్థలాన్ని రైల్వే ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఎస్‌ఐ ప్రసాద్‌ పరిశీలించారు. గేదె యజమాని కోసం వెతుకుతున్నారు.

Read also: Dog : ఆత్మహత్య చేసుకున్న యజమానిని రక్షించేందుకు 4గంటలు పోరాడిన కుక్క

రాజస్థాన్ లో వందే భారత్​ ఎక్స్​ప్రెస్ నీలగై జింకను ఢీకొట్టిన ఘటనలో జింకతోపాటు ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన అల్వార్ లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగింది. వందే భారత్ రైలు వేగంగా వెళ్తూ పట్టాలపైన ఉన్న ఓ నీలగై జింకను ఢీ కొట్టింది. దీంతో అది ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతో పాటు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శివదయాల్ గా గుర్తించి అతడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Dog : ఆత్మహత్య చేసుకున్న యజమానిని రక్షించేందుకు 4గంటలు పోరాడిన కుక్క

Show comments