Nizamabad Crime: కుటుంబంలో కలతలు చిలికి చిలికి గాలివానై చివరకు చిల్లపిల్లల ప్రాణాలు బలితీసుకునే విధంగా మారాయి. భార్యా భర్తలు ఒకరి నొకరు అర్థం చేసుకోకపోవడం ఒకటైతే.. ఇద్దరిపై ఒకరిపై మరొకరి నమ్మకం లేకపోవడం మరో కారణం. భర్త, భార్య ఉద్యోగ రీత్యా కుటుంబంతో ఎక్కువ సేపు గడపక పోవడం మరికొన్ని గొడవలకు దారితీస్తున్నాయి. దీంతో చెడుతిరుగుల్లకు అలవాటు పడటం, వేరొకరితో అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈఅలవాటుతో చిన్నపాటి విషయాలు సైతం గొడవగా మారి ఆ గొడవ కాస్త మాట మాట పెరిగి చివరకు ఆకోపం పసికందులపై చూపిస్తున్నారు. కన్న తల్లిదండ్రులనే సంగతి మరిచి వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఓ కసాయి తల్లి నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకుని చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో మక్లూర్ మండలం దాస్‌నగర్ శివారులో కలకలంరేపింది.
Read also: Karnataka polls: గిరిజన వర్గాలపై ఈసీ దృష్టి.. ‘జాతి పోలింగ్ కేంద్రాలు’ ఏర్పాటు
నిజమాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ శివారులో భరత్, లావణ్య నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం వీరి జీవితం అన్యోన్యంగా సజావుగా సాగిన వీరి కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. దీంతో లావణ్య చెడుతిరుగుల్లకు అలవాటు పడింది. భర్త మందలించిన వినకుండా తను లేనప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయింది. తన పనికి పెద్ద కుమారుడు కన్నయ్య అడ్డుగా ఉండటంతో భర్త ఇంట్లో లేని సమయంలో చంపేసింది. ఇది తెలిసిన భర్త ఎందుకు ఇలా చేశావంటూ కోపంతో రగిలిపోయాడు.. చిన్న కొడుకు ఉన్నాడు కదా మారుతుంది అనుకున్నాడు. అందుకే ఇంటి పరువు వీధిన పడుతుందని భావించి ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేక పోయాడు. అయినా భార్య లావణ్యలో ఎలాంటి మార్పు రాలేదు. ముందుకన్నా మరీ ఎక్కవగా చెడు అలవాట్లను మొదలు పెట్టింది. ఇది మంచిది కాదని, ఇంట్లో చిన్నపిల్లవాడు ఉన్నాడని తనను చూసైనా నీ అలవాట్లు మానుకోవాలని భర్త భరత్ హెచ్చరించాడు. దీంతో చిన్న కొడుకు పై లావణ్య కోపం పెంచుకుంది. ఎలాగైనా పెద్దకొడుకు తరహా 6 ఏళ్ల బాలుడు రోహిత్ ను కూడా చంపేయాలని ప్లాన్ వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ ను గొంతు నులిమి చంపేసింది. భరత్ ఇంటికి వచ్చి చూడగా షాక్ కు గురయ్యాడు. భార్య లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లావణ్యను అదుపులో తీసుకున్నారు. లావణ్య ఇలా చేయడానికి కారణం మానసిక పరిస్థితా? లేక లావణ్యతో ఎవరైనా పిల్లలను చంపేందుకు ప్రోత్సహించారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
Gang War in Old City: రచ్చకు దారితీసి క్రికెట్ ఆట.. బాల్ ఇంట్లోకి వెళ్లిందని గ్యాంగ్ వార్
