A maniac who killed a young woman for not loving her in wanaparthy district: ప్రేమించమన్నాడు, పెళ్లి చేసుకుందామన్నాడు, దానికి ఆ అమ్మాయి నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన ఆ కిరాతకుడు ఆ అమ్మాయిని హతమార్చాడు. అంతేకాదు ఎవరికి తెలియకుండా మరొకరి సాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈదారుణమైన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేటలో సంచళనం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఎస్సై వెంకట్వేర్‌గౌడ్ తెలిపిన ప్రకారం, మానాజీపేటకు చెందిన బత్తిని శ్రీశైలంకు 2017లో హైదరాబాద్‌లో డిగ్రీ చదువుకునే రోజుల్లో కాటేదాన్ ఏరియా ఎన్జీవోస్‌కాలనీకి చెందిన సాయిప్రియతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో.. అప్పటినుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నా ఆమె నిరాకరిస్తూ వస్తోంది. భరించలేని ఆయువతి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో కుటుంబసభ్యులు ఆ యువకుడిని హెచ్చరించి వదిలేశారు.
దీంతో.. శ్రీశైలం ఈనెల 5న సాయిప్రియకు ఫోన్‌చేసి ఒకసారి మాట్లాడాలని, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌కు రావాలని కోరాడు. శ్రీశైలం మాటలు నమ్మిన సాయిప్రియ అక్కడికి వెళ్లగా బైక్‌పై ఎక్కించుకుని మానాజీపేట శివారులోని మబ్బుగుట్టల్లోకి తీసుకెళ్లాడు. మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని కోరినా సాయిప్రియ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీశైలం సాయిప్రియ మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. శ్రీశైలం బంధువు శివ సహకారంతో కేఎల్‌ఐ కాల్వ పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు. అయితే.. అప్పటికే హైదరాబాద్‌లోని కాటేదాన్ ఠాణాలో సాయిప్రియ కనిపించడం లేదని.. శ్రీశైలంపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లిదండ్రులు వెంకటేశ్, లక్ష్మి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కాటేదాన్ పోలీసులు ఆరోతేదీన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో రెండు రోజుల తర్వాత నేరం అంగీకరించడంతో.. వనపర్తి జిల్లా కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసును కాటేదాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్‌గౌడ్ చెప్పారు.
Karnataka: మందుకొట్టి పిల్లలకు పంతులమ్మ పాఠాలు.. దొరికిపోవడంతో సూసైడ్ చేసుకుంటానని బెదిరింపు