Hyderabad: పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం. ఒక్కసారే పుడతాం.. ఒక్కసారే మరణిస్తాం.. అలానే జీవితంలో పెళ్లినేది కూడా ఒక్కసారే జరుగుతుంది అనుకునేవాళ్లు కొందరైతే.. ఇష్టంగా పెళ్లి చేసుకుని అంతకంటే ఎక్కువ ఇష్టంగా విడాకులు తీసుకుని విడిపోయి వేరే పెళ్లి చేసుకునేవారు మరి కొందరు. అయితే అలా విడాకులు తీసుకుని రెండో పెళ్ళికి సిద్ధంగా ఉన్న మహిళలే లక్ష్యంగా మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుండి భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా లోని కందుకూరు మండలం నెడనూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి (38) అనే వ్యక్తికి కల్వకుర్తికి చెందిన మహిళతో 2011లో వివాహం జరిగింది.
Read also:Daggubati Purandeswari: బీజేపీపై దాష్ర్పచారం.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది..!
కాగా ఇద్దరి మధ్య గొడవలు రావడంతో గత కొంత కాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే అతను విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసాలకు పాల్పడుతన్నాడు. ఇందుకు అతను మ్యాట్రిమోనీలో శ్రీనాథ్ అనే పేరుతో పేరు నమోదు చేసికున్నాడు. అనంతరం తన వేటను ప్రారంభించాడు. ఈ వేటలో విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో పేరు నమోదు చేసుకున్న ఓ మహిళ ప్రొఫైల్‌ను సేకరించాడు. అనంతరం ఆమెకు ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఒక సారి నేరుగా కలుద్దామని చెప్పాడు. అలానే వచ్చేటప్పుడు నగలు తీసుకు వస్తే మంచి ఫోటో తీసి తన తల్లిదండ్రులకు చూపిస్తానని నమ్మించాడు. ఆ మహిళ అతని మాటలు నమ్మి ఈ నెల 7న సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని యాత్రి ఇన్ హోటల్‌కు వ్సచింది. అయితే ఫోటో బాగా రావాలంటే మంచిగా రెడీ కావాలని.. అందుకు వాష్ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్‌అప్ కావాల్సిందిగా సూచించారు.
Read also:MLC Kavitha: గాంధీలు స్వయంగా క్షమాపణ చెప్పలేరా? కవిత ట్విట్ వైరల్
దీంతో ఆమె వాష్ రూమ్‌కు వెళ్ళింది. ఆ అదును కోసమే ఎదురు చూస్తున్న అతను మహిళ వచ్చే లోపు ఆమెకు చెందిన 27 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును తీసుకుని హోటల్ నుంచి పరారయ్యాడు. దీనితో మహిళ పోలీసులను ఆశ్రయించగా కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. ఈ నేపథ్యంలో గురువారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో మహంకాళి ఏసీపీ రవీందర్, మార్కెట్ ఇన్స్‌పెక్టర్ రామకృష్ణ, డీఐ వెంకటరమణలతో కలిసి వివరాలు వెల్లడించారు. నిందితుడు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు షాదీ డాట్ కామ్‌లో గౌతమ్‌రెడ్డి పేరుతో ఓ మహిళను నమ్మించి ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ/ 6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడని..
Read also:Telangana Elections 2023: కాంగ్రెస్ కు షాక్.. కారెక్కిన కత్తి కార్తీక..
అలానే మాట్రిమోనీలో విజయరెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని రూ.9లక్షలు తన అకౌంట్‌లో వేసుకున్నాడని.. కల్వకుర్తిలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ 10వ తరగతి చదువుతున్న బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించి 3 నెలలు జైలుకు కూడా వెళ్లివచ్చాడని.. అదే విధంగా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కారు పేరుతో రూ.4.50లక్షలు తీసుకుని తన బంధువునే మోసం చేశాడని.. అలానే మాదాపూర్ లోని హాస్టల్‌లో ఉంటూ రూ.70వేల విలువ చేసే ల్యాప్‌టాప్ తదితర వస్తువులను దొంగతనం చేశాడని . అదే విధంగా చైతన్యపురిలో మరో హాస్టల్‌లో రూ.40వేల విలువ చేసే ల్యాప్‌టాప్ దొంగతనం చేశాడని పేర్కొన్నారు.