NTV Telugu Site icon

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 25 లక్షలు టోకరా..

నిరుద్యోగులు మాయగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతునే ఉన్నారు. తాజాగా ఈసీఐఎల్‌ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానిని చెప్పి రవికుమార్‌ అనే వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఏకంగా 30 మందిని మోసం చేశాడు. 12 మంది బాధితుల నుంచి ఏకంగా నుంచి రూ.25 లక్షలు దోచేశాడు రవికుమార్‌ . రవికుమార్‌ ఈసీఐఎల్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఈ మోసానికి పాల్పడ్డాడు.

పోలీసులు కథనం ప్రకారం…. రవికుమార్‌తో విస్తుపోయిన ఒక బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు ఎస్‌ఓటీ పోలీసుల సాయంతో నిందితుడిని అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికే నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. రవికుమార్‌తో మోసపోయిన మిగి లినా బాధితులు కూడా తమకు ఫిర్యాదు చేయాలని సీఐ వెల్లడిం చారు. నిరుద్యోగులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరిని పడితే వారిని నమ్మోద్దని సీఐ తెలిపారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి డబ్బులు చెల్లించొద్దని అలా ఎవ్వరైనా తమను సంప్రదిస్తే పోలీసులకు తెలియజేయాలని సీఐ కోరారు.