Site icon NTV Telugu

LB nagar flyover: ఫ్లైఓవర్‌ పై ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం.. మాటల్లో పెట్టి కాపాడిన కానిస్టేబుల్‌

Lb Nagar

Lb Nagar

LB nagar flyover: ఎల్‌బి నగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని మాటలో పెట్టి చాకచక్యంగా కానిస్టేబుల్ టి.సతీష్ కాపాడాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపించారు.

ఎల్‌బి నగర్‌ ఫ్లైఓవర్ పై ఓ వ్యక్తి అంచున నిలబడి దూకేస్తానంటూ బెదిరించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు అక్కడే వున్న కానిస్టేబుల్‌ కు సమాచారం ఇచ్చారు. దీంతో కానిస్టేబుల్ టి.సతీష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దూకుతున్న వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ వ్యక్తి దూకేస్తానని దగ్గరకు రావద్దని తెలుపడందో కానిస్టేబుల్ కంగారు పడ్డాడు. తరువాత తన వద్ద వున్న వాకీటాకీ మాట్లాడుతూ ఉన్నట్లు నటిస్తూ ఆ వ్యక్తి దగ్గరకు వెల్లడం స్టార్ట్‌ చేశాడు. ఒక తన దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. అతనితో మాట్లాడుతూనే పక్కకు లాగేశాడు. దీంతో ప్రమాదం తప్పింది.

Read also: Theft: పెండ్లి ఇంట్లో భారీ చోరీ.. 11 లక్షలతో ఉడాయించిన దొంగలు

ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ టి.సతీష్ మాట్లాడుతూ.. బస్టాప్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి డ్యూటీ చేస్తున్నాను. దాదాపు సాయంత్రం 5 గంటల సమయంలో ఫ్లైఓవర్ గుండా వెళుతున్న ప్రయాణికులు, అంచున కూర్చున్న బాధలో ఉన్న వ్యక్తి గురించి వచ్చి చెప్పారు. ఆందోళన చెందిన సతీష్ వెంటనే అతని వైపుకు పరిగెత్తాడు. ఫ్లైఓవర్‌పై కారు నడుపుతున్న ఓ బాటసారుడు యూ-టర్న్ తీసుకుని సతీష్‌ను సమయానికి అక్కడికి చేరుకోవడానికి సహకరించాడని తెలిపాడు. ఐడి కార్డ్‌లో అతని పేరు స్పష్టంగా లేదని, అతని వయస్సు 37 సంవత్సరాలు ఉంటుందని, అతని పేరు మంగ్రా గా గుర్తించారు. తన సోదరి జార్ఖండ్‌లో ఉందనే విషయాన్ని బయటపెట్టాడని అన్నారు. భావిస్తున్నారు. మేము ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాము కాబట్టి, అతన్ని ఎల్‌బి నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించామని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. జగన్నాధ్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆ వ్యక్తి సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న వలస కూలీగా పనిచేస్తున్నాడని అన్నారు. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు మరియు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్, D.S. చౌహాన్, కానిస్టేబుల్ ధైర్యసాహసాలను అభినందించారు. ఆ మనిషిని ప్రాణాలతో కాపాడిన కానిస్టేబుల్‌ కు స్థానికులు సలామ్‌ పోలీస్‌ అంటూ సెల్యూట్‌ చేస్తున్నారు.
GVL Narasimharao: టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ క్లారిటీ!

Exit mobile version