NTV Telugu Site icon

Shalini Kidnap Case: సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్.. పూజ చేసి బయటకు వస్తుండగా..

Rajanna Siricilla Girl Kidn

Rajanna Siricilla Girl Kidn

A Lover Kidnapped Shalini With Help Of His Friends In Rajanna Siricilla District: తెలంగాణలో సంచలనం సృష్టించిన డా. వైశాలి కిడ్నాప్ కేసు వ్యవహారం ఇంకా చల్లారకముందే.. మరో యువతి కిడ్నాప్‌కు గురవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయంలో పూజ చేసుకొని, బయటకు వస్తున్న సమయంలో.. కారులో వచ్చిన దుండగులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్.. రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన శాలిని (18) అనే యువతి తన తండ్రితో కలిసి తెల్లవారుజామున 5 గంటలకు హనుమాన్ దేవాలయానికి వెళ్లింది. పూజ చేసుకొని బయటకు వస్తుండగా.. ఒక కారు ఆలయం ముందుకు దూసుకొచ్చింది. అందులో నుంచి దిగిన యువకులు.. అమ్మాయిని లాక్కెళ్లారు.

Man Killed Over Land Issue: ప్రాణం తీసిన భూ వివాదం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా..

దుండగుల నుంచి తప్పించుకునేందుకు శాలిని ప్రయత్నించింది కానీ.. ఓ యువకుడు ఆమెని వెంబడించి పట్టుకున్నాడు. మరో ఇద్దరు శాలిని తండ్రిని అడ్డుకున్నారు. యువతిని కారులో ఎక్కించుకున్నాక.. కారెక్కి అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చివర్లో తన కూతురిని రక్షించుకునేందుకు తండ్రి గట్టిగానే ప్రయత్నించాడు కానీ, అటువైపు ఇద్దరు వ్యక్తులు ఉండటంతో వారిని ఎదురించలేకపోయాడు. ప్రేమ పేరుతో కొంతకాలం నుంచి వేధిస్తున్న యువకుడే.. ఈ కిడ్నాప్‌కి పాల్పడ్డాడని సమాచారం. శాలిని మైనర్‌గా ఉన్నప్పటి నుంచే.. గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతూ వచ్చాడు. తనకు ఇష్టం లేదని తిరస్కరించినా.. అతడు విడిచిపెట్టలేదు. తనని తిరిగి ప్రేమించాల్సిందేనని ఆమెని వేధించసాగాడు.

Hawaii Flight Turbulence: విమానాన్ని కుదిపేసిన బలమైన గాలులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

దీంతో.. శాలిని విషయాన్ని తన కుటుంబసభ్యులు తెలియజేయగా, వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, జైలు శిక్ష అనుభవించాడు. జైలు శిక్ష పడినా అతనిలో మార్పు రాలేదు. బయటకొచ్చాక మళ్లీ అమ్మాయి వెంట పట్టాడు. తన ప్రేమని అంగీకరించడం లేదు కాబట్టి.. ఈ కిడ్నాప్‌కి పాల్పడినట్టు తెలుస్తోంది. శాలిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? ఈ కిడ్నాప్‌లో ఎవరెవరి హస్తం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments