Site icon NTV Telugu

Fire Accident: సికింద్రాబాద్‌ పాళికా బజార్‌లో భారీ అగ్నిప్రమాదం.. బట్టల షాప్‌ లో చెలరేగిన మంటలు

Fair Accident

Fair Accident

Fire Accident: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాళికా బజార్‌లోని ఓ బట్టల షాపులో చెలరేగిన అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. పాళికా బజారులో సుమారు నాలుగు వందల షాపుల ఉన్నాయి. అక్కడే వున్న ఓ బట్టల షాపులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడ దట్టంగా పొగ అలుముకుంది. అక్కడే వున్న లాడ్జీల్లో ఉన్నవారిని, పలు బట్టల షాపులను ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. షాప్‌ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడు కోవడానికి ఇంట్లోనుంచి బయటకు పరుగులు పెట్టారు.

Read also: Hair Loss: మందు, సిగరెట్ తాగితే జుట్టు రాలుతుందా..ఈ అలవాటు వల్ల బట్టతల వస్తుందా?

స్థానిక సమాచారంతో ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు ఎలా చెలరేగాయి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్‌ షర్య్కూట్‌ వల్ల మంటలు వ్యాపించాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. షాప్ యజమానికి ఘటనపై సమాచారం అందించారు. అయితే మంటలు పక్క షాపులకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. షాప్‌ లో ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Jarkhand: దళిత బాలికల అపహరణ.. వారం రోజులుగా అత్యాచారం..

A huge fire, broke out, Secunderabad Palika Bazar

Exit mobile version