Old City Hyderabad: భాగ్యనగరంలో పాతబస్తీ గొడవలకు అడ్డాగా మారుతోంది. ఏచిన్న విషయంలో అయినా సరే మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు కత్తులు, తల్వార్లతో దాడిచేసుకోవడం నగరవాసులకు భాయభ్రాంతులకు గురిచేస్తుంది. రెండు వర్గాలు గ్యాంగ్ వార్‌కు దిగడం టెన్షన్ పుట్టిస్తోంది. కత్తులు, కొడవళ్లతో దాడి చేసుకోవడం ఓల్డ్‌సిటీలో సంచలనంగా మారింది.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో నిన్న రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపింది. అక్కడే వున్న ఓ జిమ్ దగ్గర పార్కింగ్ విషయంలో గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. అదికాస్త చివరికి కత్తులతో దాడి చేసుకునేంత వరకు వచ్చింది. ఈ గొండవలు సంబంధం లేని వ్యక్తులు ఈ గొడవలోకి ఎంటర్ కావడంతో ఇద్దరి గ్రూపుల మధ్య వార్ మరింత ముదిరింది. రంగంలోకి పోలీసులు దిగారు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీఛార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టాడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
Read also:Fire Accident Medak: మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆహుతైన షాపులు
కాగా.. నిత్యం రద్దీగా ఉండే బార్కస్ ప్రాంతంలోని ఓ జిమ్‌కు ఫహద్, ఖాలీద్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అయితే.. జిమ్ పక్కనే ఉన్న ఓ షాపు ఎదుట తమ వాహనాన్ని పార్కింగ్ చేశారు. ఈనేపథ్యలో.. షాపు యజమాని వాహనం ఇక్కడ పార్కింగ్ చేయవద్దంటూ చెప్పాడు. ఎందుకు పెట్టకూడదు అంటూ పార్కింగ్ చేసిన వ్యక్తి, షాప్ యజమానితో గొడవకు దిగాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇదంతా గమనిస్తున్న ఓ రౌడీషీటర్ సులేమాన్ వారిద్దరి వివాదంలోకి తలదూర్చాడు. గొడవను ఆపడానికి తమవంతు ప్రయత్నం చేశాడు. అయినా గొడవ పెరుగుతుండటంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫహద్(షాప్ ముందు బైక్ పార్కింగ్ చేసిన వ్యక్తి) తన సోదరుడు అయిన చంద్రాయణగుట్ట రౌడీషీటర్ అలీకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అతను రావడం రావడం కత్తులతో విన్యాసాలు చేసుకుంటూ అక్కడికి వచ్చిన అలీ యజమాని, సులేమాన్‌తో వాగ్వాదానికి దిగాడు. ఒక సులేమాన్‌పై అలీ కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో బార్కస్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Read also: Magha Amavasya: నేడు మాఘ అమావాస్య.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
స్థానక సమాచారంతో చంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ నాగేంద్రప్రసాద్ వర్మ ఘటనా స్థలానికి చేరుకుని లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. కత్తులతో రోడ్డుపై దాడి చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో స్థానికులు కాసేపు టెన్షన్ పడ్డారు. అక్కడ కాసేపు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు చివరికి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై కత్తులతో దాడి చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో స్థానికంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే.. సకాలంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రాణహాని తప్పిందని స్థానికులు చెబుతున్నారు.