Father attack Sun: కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న పనులకు పిల్లలపై విసిపోయి వారిపై అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కన్న బిడ్డలను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే వున్నాయి. కన్నకొడుకు ఏడుపు ఆపడంలేదని కిరాతంగా తన సొంత తండ్రే కొట్టిచంపిన ఘటన మరువకముందే.. మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు చేనులో పనికి వెళ్లను అన్నందుకు కొడుకు కత్తతో పొడిచి చంపాడు తండ్రి. ఈఘటన నాగపూర్‌లో సంచళనంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం నాగపూర్ లో ఓకుటుంబం నివాసం ఉంటోందివారికి ధర్మ రాజు అనే కొడుకు ఉన్నాడు. రోజూలాగే ఇవాళకూడా చేనులో పనికి వెళ్లాలని తండ్రి కొడుకుని పురమాయించాడు. అయితే చేనుకు వెళ్లేందుకు కొడుకు ధర్మరాజు నిరాకరించాడు. దీంతో తండ్రి కొడుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన తండ్రి అక్కడే ఉన్న కత్తితో కొడుకుపై దాడి చేశాడు. కొడుకును కడుపు వీపుపై విచక్షణారహితంగా పొడిచాడు దీంతో కొడుకు ధర్మరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు కొడును రిమ్స్‌కు తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని తండ్రిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
Read also: Inspiring journey: నాడు ఖాళీ కడుపుతో బాలుడు అవస్థలు.. నేడు అమెరికాలో సైంటిస్ట్‌గా ప్రశంసలు
ఈనెలలోనే హైదరాబాద్ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. నేరేడ్మెట్ జే జే నగర్ లోని ఎస్.ఎస్.బి క్లాసిస్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా నివసించే దివ్య, సుధాకర్ దంపతులు. 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దివ్య సుధాకర్ కి 2సం: కుమారుడు ఉన్నాడు. సుధాకర్ రాత్రి తప్పతాగి ఇంటికి రాగా.. ఇంట్లో రేడేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. సుధాకర్ తన కొడుకు బుజ్జగించినా ఇంకా ఏడుస్తూనే ఉండటతో కొడుపుపై కోపంతో దారుణంగా కొట్టాడు మద్యం మత్తులో బాలుడు జీవన్ ని తీవ్రంగా కొట్టడంతో జీవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. భయాందోళన చెందిన తల్లి నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధాకర్ ను అదుపులో తీసుకున్నారు.