NTV Telugu Site icon

Drunkard: పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు.. బట్టలు విప్పి హల్ చల్

Drunked Man

Drunked Man

A drunken man created a ruckus in Medchal: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. మద్యం తాగి నానా హంగామా సృష్టించాడు. రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ జై కొట్టాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు పిల్లదొరకట్లేదంటూ బూతులు తిడుతూ రోడ్డుపై బట్టలు విప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. అక్కడే వున్న అంబేద్కర్ విగ్రహం ఎక్కి జై అంటూ నినాదాలు చేశాడు. రోడ్డు పడుకుని దండాలు పెడుతూ నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితి. దీంతో స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం మత్తులో వున్న వ్యక్తిని కంట్రోల్‌ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి 44 పై అర్థరాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో బట్టలు విప్పేసి హల్చల్ చేశాడు. రహదారిపై పడుకొని వాహనాలను అడ్డుకుంటూ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అని నినాదాలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందికి గురిచేశాడు. స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్నారు పోలీసులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం లెక్కచేయకుండా చౌరస్తా దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎక్కి జై అంబేద్కర్.. జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు అంటూ బూతులు తిడుతూ రోడ్డుపై హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు కంట్రోల్‌ చేసేందుకు చమటలు పట్టాయి. అయినా పోలీసులు సహనంతో అతన్ని ఎవరు నువ్వు? నీ పేరు ఏంటి? సమాచారం సేకరించి కుటుంబ సభ్యులను అప్పగించారు.
Niharika : ఆ హీరోతో నిహారిక రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో పుకార్లు