NTV Telugu Site icon

Sucide Selfie Video : మా భూమిని కబ్జా చేసారు.. దంపతుల సెల్ఫీ వీడియో.. సూసైడ్ లెటర్….!

Janago

Janago

Janago: మా భూమి ఆక్రమణకు గురైందంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన దారుణ ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తమకు జరిగిన అన్యాయంపై ఏడుస్తూ వీడియో తీశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారి పేర్లను ఆత్మహత్య లేఖ ద్వారా దంపతులు వెల్లడించారు. ఆక్రమిత భూమిలో పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా నర్మెట్ట మండలం సూర్యబండ తండాలో గురు, సునీత దంపతులకు వారసత్వంగా కొంత భూమి ఉంది. రాళ్లు, నాగళ్ల కారణంగా వ్యవసాయానికి పనికి రాకపోవడంతో దంపతులు ఆ భూమి వైపు వెళ్లలేదు. దీంతో భూమిపై కన్నేసిన కొందరు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులను, పోలీసులను, కోర్టులను ఆశ్రయించినా.. ఆక్రమిత భూమి తమకు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

Read also: Vishakha Love Story: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్ట్.. లెటర్‌ రాసింది భర్తకు కాదా?

తమ భూమిని ఆక్రమించిన వారు, అందుకు సహకరించిన వారి పేర్లపై దంపతులు సూసైడ్ లెటర్ రాశారు. పురుగుల మందు డబ్బా తీసుకుని తమ ఆక్రమిత భూమిలోకి వెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ భార్యాభర్తలిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించిన గురు, సునీత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించగా గురు, సునీత దంపతులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దంపతులు చికిత్స పొందుతున్నారని.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తమ భూమిని ఆక్రమించడమే కాకుండా మూడుసార్లు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని సెల్ఫీ వీడియోలో దంపతులు పేర్కొన్నారు. చనిపోయిన తర్వాత కూడా ఆ భూమి కబ్జా చేసిన వారికే చెందుతుందని తేలితే.. తమకే ఇవ్వాలని.. లేకుంటే తమ ఇద్దరు పిల్లల పేరు మీద చేయాలని కోరుతున్నారు. స్థానికులంతా తమకు భూమిని నిరాకరిస్తున్నారని దంపతులు విలపించారు.
Vishakha Love Story: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్ట్.. లెటర్‌ రాసింది భర్తకు కాదా?