NTV Telugu Site icon

Road Accident in Warangal: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident In Warangal

Road Accident In Warangal

Road Accident in Warangal: వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్ధన్నపేట పట్టణ డీసీ తండా వద్ద ఈఘటన చోటుచేసుకుంది. మృతులు పెరుకావాడ కు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి ఆయన భార్య వరలక్ష్మి, కొడుకు వెంకటసాయి రెడ్డిగా గుర్తింపు. ఏపీలోని ఒంగోల్ నుండి వరంగల్ పెరుకావాడకు వస్తున్న క్రమంలో ఈఘటన జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ ఆరుగురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కారులో మొత్తం 9మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. ప్రమాదానికి గలకారణాలను తెలుసుకుంటున్నారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేక నిద్రమత్తులో కారు డ్రైవింగ్‌ చేయడం వల్ల ఘటన జరిగిందా అనేకోణంలో అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident in Warangal: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి