NTV Telugu Site icon

Sangareddy: నరికేస్తుంటే వద్దంటూ చెట్టెక్కి కూర్చున్న బాలుడు..

Sangareddy

Sangareddy

Sangareddy: పిల్లలు దేవునితో సమానం అంటారు. వారు చెప్పే మాటలు ఒక్కోసారి కోపం వచ్చినా వారు మాట్లాడే మాటల్లో నిజం ఉంటుంది. వారి చేసే పనులు కూడా విసుగు తెప్పించే విధంగా ఉంటాయి. కానీ కొందరు పిల్లలు చేసే పనిల్లో పెద్దవాళ్లకు కూడా ఆ జ్ఞానం ఉండదు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వారి పసిహృదయాలు వారికి నచ్చనిది ఏదైనా జరిగితే తట్టుకోలేరు. వారి తెగింపుకు కుటుంబమేకాదు.. ఎంతటి అధికారులైనా తలవంచాల్సిందే. పక్షులకి నివాసంగా ఉన్న చెట్టును కొందరు అధికారుల నరకుతుంటే అది చూసి భరించలేని ఓ బాలుడు నరకద్దంటూ చెట్టెక్కి కూర్చున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కాకతీయ నగర్ లో అనిరుద్ అనే బాలుడు కుటుంబం నివాసం ఉంటుంది. అయితే వారి ఇంటి ముందు పెద్దపెద్ద చెట్లు వున్నాయి. చెట్లపై పక్షులు వాలడం, వాటి అరుపులను ఆనందంగా వినేవాడు అనిరుద్. అయితే రోడ్డు వెడల్పు కోసం చెట్లను కాంట్రాక్టర్ నరుకుతూ అనిరుద్‌ ఇంటివైపు వచ్చాడు. అంతే అది గమనించిన అనిరుద్ సార్ ప్లీజ్ వద్దు చెట్లను నరకవద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. అయితే కాంట్రాక్టర్ అనిరుద్‌ మాటలు పట్టించుకోకుండా చెట్లను నరకడం ఆపలేదు. చివరకు అనిరుద్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. నరుకుతున్న చెట్టుపై ఎక్కి అక్కడే కూర్చున్నాడు.

నేను దిగను మీరు చెట్లను నరకడం ఆపండి అన్నాడు. అయితే అధికారులు అనిరుద్ మాటలకు షాక్ అయ్యారు. అంత చిన్న పిల్లాడు చెట్లను నరకవద్దని చెప్పడం ఏంటని ఆలోచనలో పడ్డారు. అంతేకాదు పక్షులకి ఆవాసంగా ఉన్న చెట్టును నరకవద్దంటూ అనిరుద్ కోరమేకాదు.. నేను చచ్చిపోతాను కానీ చెట్టు నరకవద్దంటు మారం చేశాడు. అనిరుద్ చెట్టెక్కి కూర్చోవడంతో అధికారులు చేసేదేమి లేక చెట్టును నరకడం కాసేపు నిలిపివేశారు. బాలున్ని కిందికి రావాలని కోరగా.. మీరందరూ చెట్లను నరకకుండా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అయితే అనిరుద్‌ ను చెట్టుపై నుంచి కిందికి దించేందుకు అధికారులు నానా తంటా పడ్డారు.
NTR 31: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ…