Sangareddy: నరికేస్తుంటే వద్దంటూ చెట్టెక్కి కూర్చున్న బాలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: పిల్లలు దేవునితో సమానం అంటారు. వారు చెప్పే మాటలు ఒక్కోసారి కోపం వచ్చినా వారు మాట్లాడే మాటల్లో నిజం ఉంటుంది. వారి చేసే పనులు కూడా విసుగు తెప్పించే విధంగా ఉంటాయి. కానీ కొందరు పిల్లలు చేసే పనిల్లో పెద్దవాళ్లకు కూడా ఆ జ్ఞానం ఉండదు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వారి పసిహృదయాలు వారికి నచ్చనిది ఏదైనా జరిగితే తట్టుకోలేరు. వారి తెగింపుకు కుటుంబమేకాదు.. ఎంతటి అధికారులైనా తలవంచాల్సిందే. పక్షులకి నివాసంగా ఉన్న చెట్టును కొందరు అధికారుల నరకుతుంటే అది చూసి భరించలేని ఓ బాలుడు నరకద్దంటూ చెట్టెక్కి కూర్చున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కాకతీయ నగర్ లో అనిరుద్ అనే బాలుడు కుటుంబం నివాసం ఉంటుంది. అయితే వారి ఇంటి ముందు పెద్దపెద్ద చెట్లు వున్నాయి. చెట్లపై పక్షులు వాలడం, వాటి అరుపులను ఆనందంగా వినేవాడు అనిరుద్. అయితే రోడ్డు వెడల్పు కోసం చెట్లను కాంట్రాక్టర్ నరుకుతూ అనిరుద్ ఇంటివైపు వచ్చాడు. అంతే అది గమనించిన అనిరుద్ సార్ ప్లీజ్ వద్దు చెట్లను నరకవద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. అయితే కాంట్రాక్టర్ అనిరుద్ మాటలు పట్టించుకోకుండా చెట్లను నరకడం ఆపలేదు. చివరకు అనిరుద్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. నరుకుతున్న చెట్టుపై ఎక్కి అక్కడే కూర్చున్నాడు.
Also Read
నేను దిగను మీరు చెట్లను నరకడం ఆపండి అన్నాడు. అయితే అధికారులు అనిరుద్ మాటలకు షాక్ అయ్యారు. అంత చిన్న పిల్లాడు చెట్లను నరకవద్దని చెప్పడం ఏంటని ఆలోచనలో పడ్డారు. అంతేకాదు పక్షులకి ఆవాసంగా ఉన్న చెట్టును నరకవద్దంటూ అనిరుద్ కోరమేకాదు.. నేను చచ్చిపోతాను కానీ చెట్టు నరకవద్దంటు మారం చేశాడు. అనిరుద్ చెట్టెక్కి కూర్చోవడంతో అధికారులు చేసేదేమి లేక చెట్టును నరకడం కాసేపు నిలిపివేశారు. బాలున్ని కిందికి రావాలని కోరగా.. మీరందరూ చెట్లను నరకకుండా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అయితే అనిరుద్ ను చెట్టుపై నుంచి కిందికి దించేందుకు అధికారులు నానా తంటా పడ్డారు.
NTR 31: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!