Site icon NTV Telugu

Swimming Pool: ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడ్డ బాలుడు.. ఆతరువాత!

Swimming Pool

Swimming Pool

Swimming Pool: పిల్లలు ఆడుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు వారిపై కంటకనిపెట్టాలి. లేదంటే మనం చిన్నారులను కోల్పోవాల్సి వస్తుంది. జరగరాని ఘోరాలు జరగాక కన్నీరుపెట్టుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన ప్రయోజనం ఉండదు. బయటకు వెళ్లినా, పక్కంట్లో ఆడుకుంటున్నా వారిపై ఒక కన్నువేసి ఉంచాలి. పసితనంలో, ఏమీ తెలియని వయస్సు, అమాయకత్వంలో ఏం చేస్తారో చిన్నారులకు అవగాహన ఉండదు. చుట్టు పక్కల ఏముందో తెలియని పరస్థితుల్లో చిన్నారులు ఉంటారు. ఆ ఆనందంలో ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలుసుకోలేరు. వారికి తెలియకుండానే మృత్యువు ఓడికి జారుకునే పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి ఘటనే నార్సింగ్‌ పుప్పాల్‌ గూడలో జరిగింది.

Read also: Teacher: చీ..ఛీ.. నీఛుడా.. బిడ్డకు చదువు చెప్పమంటే.. తల్లిపై అఘాయిత్యమా!

నార్సింగ్‌ లోని పుప్పాల్ గూడలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్‌ మూడో ప్లోర్‌ లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబం ఉంటుంది. వారికి దినేష్‌ అనే ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ఆ అపార్ట్‌ మెంట్‌లో మూడో ఫ్లోర్‌ లోనే స్విమ్మింగ్‌ ఫూల్‌ కూడా ఉంది. అయితే అక్కడే తన కుమారుడు దినేష్‌ ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు వారిపనిలో నిమగ్నమయ్యారు. దినేష్‌ ఆడుకుంటూ పక్కనే ఉన్న స్విమ్మింగ్‌ ఫూల్‌ లో పడిపోయాడు. అరలేని పరిస్థితి అరిచినా ఎవరికి వినపడలేని దుస్థితి. స్విమ్మింగ్‌ ఫూల్‌ లో కొట్టుకుంటున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. అయితే అక్కడే ఉన్న మరో బాలుడు అది గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో హుటా హుటిన స్విమ్మింగ్‌ ఫూల్‌ దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు బాలుడు విగత జీవిగా పడివుండటం చూసి షాక్‌ తిన్నారు. వెంటనే స్విమ్మింగ్‌ ఫూల్‌ లో దిగి దినేష్‌ ను నీళ్లలోంచి తీసుకుని బయటకు తీసుకుని వచ్చారు. అయితే దినేష్‌ ఏమీ మాట్లాడకపోవడంతో హుటాహుటిన వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లారు. అయినా ఫలితం దగ్గలేదు. దినేష్‌ అప్పటికే ప్రాణాలు వదిలాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాదంగా మారింది. తమ గారాల‌ పట్టి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు.
Salaar Teaser: సలార్‌ పార్ట్‌-1.. ‘సీజ్‌ఫైర్‌’ అంటే ఏంటో తెలుసా?

Exit mobile version