NTV Telugu Site icon

Nizamabad: ప్రాణం తీసిన కారు.. ఊపిరాడక బాలుడు మృతి

Nizamabad Crime

Nizamabad Crime

Nizamabad: కారులో ఊపిరి ఆడక ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసి పేటలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి ఆరేళ్ల బాలుడు రాఘవ ఉన్నాడు. అయితే రాఘవ ఆడుకుంటూ ఎదురుగా రోడ్డుపై ఉన్న కారులోపలికి వెళ్లాడు. రాఘవ కారులోపలికి వెళ్లగానే డోర్ పడి లాక్ అయిపోయింది. దీంతో రఘవ కారులోపలే ఉండిపోయాడు. కాసేపు ఆడుకుంటూ తరువాత అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఊపిరి ఆడక ఆ బాలుడు కారులోనే మృతి చెందాడు. అయితే కారులో అంతసేపు బాలుడు రాఘవ వున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. రాఘవ తల్లిదండ్రులు బాలుడు ఇంట్లో కనిపంచకపోవడంతో.. వెతుకుతూ బయటకు వచ్చారు. అంతా వెతికినా రాఘవ జాడ కనిపించలేదు.

Read also: Allahabad High Court: హిందూ వివాహానికి ఏడడుగులు తప్పనిసరి.. ‘కన్యాదానం’ అవసరం లేదు.. హైకోర్టు తీర్పు

తల్లిదండ్రులు భయాందోళన చెందారు. రాఘవను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని, అక్కడ పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే కారును గమనించిన కొందరు కారుదగ్గరకు వెళ్లి చూడగా అందులో రాఘవ విగతజీవిగా కనిపించాడు. వెంటనే కారు ఓనర్ కు పిలిపించి కారులో వున్న రాఘవను బయటకు తీశారు. అయితే రాఘవ మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కొద్ది సేపటి ముందే తమ కళ్లముందు ఆడుకుంటున్న కొడుకు అంతలోనే మృతి చెందాడని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కారు ఓనర్ ను విచారిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపట్ల అప్పమత్తంగా ఉండాలని కోరారు. పిల్లలను కంటి రెప్పలా చూసుకోవాలని సూచించారు. లేదంటే పిల్లలను కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.
beer Sales: మండుతోన్న ఎండలు.. కూల్‌గా బీర్లు లాగిస్తున్నారుగా..!