మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలా పూర్ చెక్ పోస్ట్ వద్ద దండ కర్ర యువకుని ప్రాణాలు మింగింది. ఇద్దరు యువకులు బైక్ పై దండేపల్లి నుండి జన్నారం వైపు వెళ్లారు. అదే సమయంలో తపాల్ పెట్ చెక్ పోస్ట్ దండకర్రను ఒక్కసారిగా కిందకు దించారు. దీంతో బైక్ ను డ్రైవ్ చేస్తున్న యువకుడు తలవంచి తప్పించుకున్నాడు. వెనుక ఉన్న మరోక యువకునికి దండను గమనించకపోవడంతో తల దండకు తగిలింది. తలకు దండ తగలడంతో తీవ్రగాయలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడు సంఘటన స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణమయ్యారని బంధువులు అరోపిస్తున్నారు. ఆ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బందువులు కోరుతున్నారు.