Ganja Batch Attack: హసన్ నగర్ లో అడ్డగా అడ్డగోలుగా కొందరు కేటుగాళ్లు గంజాయి విక్రయిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా రోడ్ల పైనే గంజాయి సేవిస్తున్నారు. ఇళ్లవద్ద గంజాయి సేవిస్తూ అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అడ్డు అదుపు లేకుండా దాడికి పాల్పడుతున్నారు. గాంజాయి మత్తులు చేతికి అందిన దానితో ఎదుటి వారిపై దాడికి దిగుతున్నారు. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
Read also: Annamalai: క్రికెట్ స్టేడియం హామీ ఎన్నికల స్టంట్.. సీఎం స్టాలిన్‌పై అన్నామలై..
అత్తాపూర్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు. హసన్ నగర్ లోని ఓ ఇంటి పై దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు గంజాయి సేవించ వద్దని ఇద్దరు అన్నదమ్ములు వచ్చిని గంజాయి బ్యాచ్ కు తెలిపారు. అయితే అప్పటికే గంజాయి సేవించిన గ్యాంగ్ వారితో గొడవకు దిగింది. అయితే అన్నదమ్ములు ఇది ఫ్యామిలీ ఉంటున్న ఇళ్లు.. ఇంటి ముందు ఇలా కూర్చొని గంజాయి సేవించడం ఏంటి ఇక్కడి నుంచి వెళ్లాలని కోరారు. అయినా కూడా గంజాయి గ్యాంగ్ వినలేదు. అన్నదమ్మలపై రెచ్చిపోయి ఒక్కసారిగా దాడికి దిగారు. వారిపై విచకణారహితంగా అక్కడే వున్న రాళ్లతో, కర్రలతో అన్నదమ్ములపై గంజాయి గ్యాంగ్ దాడికి తెగ బడింది. గ్యాంగ్ దాడిని తప్పించుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు పరుగులు పెడుతూ ఇంట్లోకి వెళ్లిన వదలలేదు.. ఇంట్లో ఉన్న అన్నదమ్ములపై రాళ్ల దాడి చేశారు.ఈ దాడిలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని కేసు నమోదు చేసిన కాప్స్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Ariana Glory : చీకటిలో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అరియానా.. ఇదిగో ప్రూఫ్..