అరియనా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తుండే ఈమె వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది.. అదే పాపులారిటితో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన యాటిట్యూడ్ అందరిని ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలియంది కాదు.. నిత్యం హాట్ ఫోటో షూట్ చేస్తూ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.. తాజాగా దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఎవరైనా సినిమాలతో బిజీగా ఉంటారు.. కానీ ఈ అమ్మడు మాత్రం.. సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయ్యింది.. ఇక బుల్లితెరకు మాత్రమే పరిమితం అయ్యింది.. వరుస షోలల్లో మెరుస్తూ కుర్రాళ్లలో క్రేజ్ ను పెంచుకుంటుంది.. ఆ మధ్య బిబి జోడిలో ముక్కు అవినాష్ తో కలిసి పాల్గొంది.. బీబీ జోడి ఫైనల్ లో ఫైమా-ఆర్జే సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు..
ఇదిలా ఉండగా తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.అరియనా దొంగతనం చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి తో పాటు కారులో వెళుతుంది.. అయితే ఊరి చివర పాలకూర తోట కనిపిస్తే అక్కడ ఆగి ఎవరూ లేరని చేతికి పనిమొదలు పెట్టింది.. కొన్ని మొక్కలను తీశాక రైతులు వచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇదేం పని పాలకూరను దొంగతనం చేస్తారా ఏంటిది అంటూ వరుస కామెంట్స్ చేస్తున్నారు.ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..