Siddipet Crime: సిద్దిపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్య చితికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని కంటతడ పెట్టించింది.
హుస్నాబాద్ మండలం పొట్టపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య నిన్న (గురువారం) మధ్యాహ్నం తన గ్రామ శివారులోని ఎల్లమ్మగుట్ట వద్ద పీరు వేశాడు. అనంతరం చితికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడు చితికి నిప్పంటించిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిప్పంటించుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటయ్య ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై మణెమ్మ తెలిపారు.
Read also: Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్.. తలసాని కీలక వ్యాఖ్యలు
కొడుకుల వద్దకు వెళ్లడం ఇష్టంలేక వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. గతంలో వృద్ధుడి భార్య చనిపోవడంతో పొలాన్ని తన నలుగురు కుమారులకు తన పేరిట రాసిచ్చాడు. కొంతకాలంగా స్వగ్రామంలో ఉంటున్న పెద్ద కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఐదు నెలల క్రితం, నలుగురు కొడుకులు తమ తండ్రిని పెద్దల సమక్షంలో నెలకు ఒక వంతు చొప్పున ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కుమారులు సొంత గ్రామంలో ఉండగా ఒకరు ముస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివసిస్తున్నారు. కానీ వెంకటయ్య మాత్రం తన ఊరు విడిచి వెళ్లడానికి మనసు ఒప్పుకోలేదు. అంతేకాకుండా వెంకటయ్య తన కుమారుల ఇళ్లలో నెలలు వారిగా వెళ్లడం ఇష్టంలేక తన చేతితో చితిని పేర్చుకుని తానే నిప్పంటించుకుని చనిపోయాడు. స్వగ్రామంలోని పెద్దకొడుకు ఇంట్లో ఇంట్లో వంతు పూర్తై బుధవారం కరీంనగర్ జిల్లాలోని మరో కుమారుడి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడికి వెళ్లని వెంకటయ్య చితికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పోషణ కుమారులకు భారం కాకూడదనే కారణంతో వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వెంకటయ్య మృతితో గ్రామంలో కలకలం సృష్టిస్తోంది.
KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన