Site icon NTV Telugu

Jagtial Crime: భర్త పదేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు..కొడుకు కానరాకుండా వెళ్లిపోయాడు

Jagityala Crime

Jagityala Crime

Jagityala Crime: కుటుంబ భారం మోసేందుకు ఓతండ్రి ఉపాధి నిమిత్తం ప‌దేండ్ల క్రితం గ‌ల్ఫ్‌కు వెళ్లాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్లేముందు తనకు రెండేళ్ల బాబు ఉన్నాడు. ఉపాధి నిమిత్తం ప‌దేండ్ల నుంచి గ‌ల్ఫ్‌లోనే తండ్రి ఉంటున్నాడు. నిన్న కుటుంబంతో ఆనందంగా గడిపేందుకు ఇంటికి వచ్చాడు. తన పిల్లలను చూసి న తండ్రి మురిసిపోయాడు. కానీ.. ఆతండ్రికి మురిపెం క్షణాల్లోనే ఆవిరైపోయింది. మంచినీళ్ల కోసం ఇంటి నుంచి బయలు దేరిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆతల్లి కన్నీరుమున్నీరైంది. గుండెలు బాదుకుంటూ కన్నకొడుకుని చూసి రోదించిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టించింది.

Read also: Mla muthireddy daughter: నా సంతకం ఫోర్జరీ చేశారు.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు ఫిర్యాదు

జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్‌, పద్మిని దంపతులకు కూతురు హర్ష, కుమారుడు శివకార్తీక్‌ ఉన్నారు. అయితే శివకార్తీక్‌కు రెండేళ్ల వయసున్నప్పుడు మోహన్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అప్పటి నుంచి మోహన్ ఫోన్ లో పిల్లల బాగోగులు తెలుసుకునేవాడు. పదేళ్ల తర్వాత సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో భార్యాపిల్లలు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి మోహన్‌ను ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ల ఇంట్లో తాగునీరు అయిపోవడంతో శివకార్తీక్ యాక్టివా తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. బైపాస్ రోడ్డులోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన శివకార్తీక్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శివకార్తీక్ 5వ తరగతి చదువుతున్నాడు.
Vande Bharat Train: వందే భారత్‌ రైలుకు తప్పిన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..

Exit mobile version