Site icon NTV Telugu

సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రోడ్లను బ్లాక్‌ చేసే అధికారం ఎవ్వరికి లేదు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రోడ్లపై ఆందోళన చేస్తున్న అన్నదాతల క్యాంప్‌లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజువారి కార్యకలాలపాలకు అంతరాయం కలగడంతోపాటు ప్రజా రవాణా ఆటంకం కలుగుతుంది. ఈ అంశంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ అనే మహిళా సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేసింది. ఈ పిల్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, ఎంఎం సుందేరేశ్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. సమస్యలకు పష్కారం కనుగొనాలని, నిరసనలు తెలిపే హక్కు ఉందని కానీ రోడ్లను బ్లాక్‌ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారం ఎవ్వరికి లేదని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.

Exit mobile version