కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,11,251 శాంపిల్స్ పరీక్షించగా.. 614 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 657 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330కి పెరగగా.. రికవరీ కేసులు 6,31,389కు చేరాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 3,800 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 9,141 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
తెలంగాణ కరోనా అప్డేట్…
corona