TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సమగ్రంగా దర్యప్తు చేస్తున్న సిట్ కు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొత్తం 9 మందిని వేరు వేరు ప్రదేశాల్లో తీసుకువెళ్లి విచారిస్తున్న సిట్ కు రోజుకో ట్విస్ట్ ఎదురవుతుంది. వరుసగా నాలుగు రోజుల విచారణ జరిపిన సిట్ ఇవాళ 5వ రోజుకు చేరింది. సిట్ వేగం పెంచడంతో ఉత్కంఠ నెలకొంది.
Read also: Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్‌లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి మరొకొద్ది సేపట్లో 9 మంది నిందితులు హాజరుకానున్నారు. విచారణలో పలు కీలక విషయాలు రాబట్టిన సిట్. రాజ్ శేఖర్, ప్రవీణ్, రేణుకా ఆమె భర్త డాక్యాను సుదీర్ఘంగా సిట్ విచారించింది. రాజ్ శేఖర్ ఇచ్చిన సమాచారంతో తన మిత్రుడు సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. సురేష్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ కమిషన్ లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు క్వాలిఫై అయినట్లు ఆధారాలు సేకరించింది సిట్. దీంతో ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ బృందం Tspsc కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పనిచేస్తున్న సూపర్డెంట్ శంకర్ లక్ష్మి విచారించింది. శంకర్ లక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వివిధ కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాల సిట్ విచారణలో ఇంకా ఏ విషయాలు బయట పడునుందో.. ఏం వినాల్సి వస్తుందో అంటూ ఆందోళన నెలకొంది. పేపర్ లీక్ పై ఇప్పటికే రాజకీయ నాయకులు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే ఇవాల ఐదవ రోజు 9మందిని విచారణలో సిట్ ఏం చెప్పనుందో వేచి చూడాలి.
Amritpal Singh Case: ఐదో రోజు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట.. ఇండో-నేపాల్ బోర్డర్‌లో హై అలర్ట్..
