Site icon NTV Telugu

తెలంగాణలో కొత్తగా 420 కరోనా కేసులు నమోదు…

corona

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ రోజువారి కేసుల తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 87,355 సాంపిల్స్‌ పరీక్షించగా.. 420 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కోవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 623 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,52,135కు చేరగా.. రికవరీ కేసులు 6,40,688గా పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,841కి పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 98.24 శాతంగా ఉందని పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,606 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Exit mobile version